![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1003 లో... కాసేపట్లో దుగ్గిరాల ఆస్తులు మొత్తం నా సొంతం అవుతాయని రేఖ హ్యాపీగా ఉంటుంది. ఇందు సంతకం చేసేటప్పుడు వీడియో తియ్యాలి. అప్పుడు మనం బలవంతం పెట్టలేదు. తన ఇష్టపూర్వకంగా ఆస్తులు రాసిందని అనుకుంటారని రేఖతో తన బిజినెస్ పార్టనర్ చెప్తాడు. అలాంటి భయం అవసరం లేదు. ఆ ఇందు ఎదురు తిరగదని భ్రమరాంబ అంటుంది.
అప్పుడే రేఖకి మీడియా ప్రెసిడెంట్ కాల్ చేసి.. మీరు బలవంతంగా ఇందు చేత ఆస్తులు రాయించుకుంటున్నారని ఎవరో మీడియా వాళ్ళకి కాల్ చేశారు. అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారని అతను చెప్పగానే రేఖ షాక్ అవుతుంది. మీరు అందరిని రాకుండా చూడండి.. మీకు కావాల్సింది మీకు అందుతుందని రేఖ అతనికి చెప్తుంది.
మరొకవైపు కావ్య, స్వాతి మాట్లాడుకుంటుంటే అపర్ణ వస్తుంది. నేను ఇంత టెన్షన్ గా ఉంటే మీరు ఇంత కూల్ గా ఎలా మాట్లాడుకుంటున్నారని కోప్పడుతుంది. అప్పుడే రేఖ వచ్చి మా ముందు మంచిగా ఉంటూనే వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నావా మీడియా వాళ్లకి ఎందుకు కాల్ చేసావని ఇందుపై రేఖ కోప్పడుతుంది. నేనేం చెయ్యలేదు ఆంటీ అని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. మిమ్మల్ని మా రేఖ బానే చూసుకుంటుంది కదే ఎందుకు ఇలా చేసావని భ్రమరాంబ అంటుంది.
ఇందుని రేఖ తిడుతుంటే.. ఆపండి మీడియా వాళ్లకి చెప్పింది నేను.. ఎన్నిరోజులు మీ ఆటలు సాగుతాయని సుభాష్ కోప్పడతాడు. అంకుల్ కి బానే ధైర్యం వచ్చిందని రేఖ అంటుంది. ఆస్తులు రాయకపోతే ఏం చేస్తానో తెలుసు కదా అని రేఖ బ్లాక్ మెయిల్ చెయ్యగానే.. ఆంటీ నేను ఇప్పుడు సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఇందు అంటుంది. సరే సంతకం పెట్టడానికి కొంచెం టైమ్ ఉందని రేఖ అంటుంది.
కిడ్నాప్ చెయ్యడానికి వచ్చిన స్వాతి మనుషులు జ్యూస్ లో మత్తు కలిపి అది వర్క్ చేస్తుందో లేదో టెస్ట్ చెయ్యడానికి శేషుకి జ్యూస్ ఇస్తారు. అది తాగి శేషు పడిపోతాడు. ఆ తర్వాత కేక్ కటింగ్ దగ్గరికి ఇందుని రేఖ తీసుకొని వచ్చి కేక్ కట్ చేయిస్తుంది. ఇక ఈ ఆస్తులన్నీ రేఖ ఆంటీ చూసుకుంటుందని చెప్తుంది.
తరువాయి భాగంలో ఇందుతో రేఖ బలవంతంగా సంతకం చేయిస్తుంటే పార్టీ మొత్తం పొగ వచ్చేలా చేసి ఇందుని రాజు కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత అందరు కలిసి వెతుకుతారు కానీ ఇందు ఎక్కడ కనపడదు. ఎవరో ఇందుని కిడ్నాప్ చేసి ఉంటారని ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |